ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి కామెడీగా ఫన్నీగా సాగింది. ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో అలరించింది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ టీమ్స్ మధ్య ఈ వారం పోటీ జరిగింది. అందులో ఆటో రాంప్రసాద్ స్కిట్ హిలేరియస్ గా నవ్వించింది. "ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి చాలామంది ఫేమస్ అయ్యారు...వాళ్ళ లాగే మీరు కూడా ఫేమస్ అవ్వాలి అనుకుంటే వెంటనే రాంప్రసాద్ రీల్స్ కోచింగ్ సెంటర్ లో చేరండి...రీల్స్ ఎలా చేయాలో ఇక్కడ నేర్పబడును" అనే ట్రెండింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసాడు. ముందుగా రీల్స్ చేసేసి అందరూ ఫుల్ ఫేమస్ ఇపోదామని అనుకుంటున్నారు కానీ అసలు రీల్స్ కి ఫుల్ ఫార్మ్ ఏంటో ఎవరికీ తెలీదు. అసలు రీల్స్ అంటే "రోతగా ఎందుకూ పనికిరాని ఎర్రిపప్పలు లక్ష్యం లేకుండా సావదొబ్బుతుంటారు" అని చెప్పాడు రాంప్రసాద్..రీసెంట్ గా "ఒక అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయ్యి చనిపోదామనుకున్నపుడు ఒక మొక్క నేనే ఇచ్చి అందులో తన లవర్ ని చూసుకోమని చెప్పాను అప్పటి నుంచి ఆ అమ్మాయి బంగారం ఒకటి చెప్పనా" అంటూ రీల్స్ చేసి ఫేమస్ ఐపోయింది అని చెప్పాడు.
తర్వాత జబర్దస్త్ యాంకర్ రష్మీ వచ్చింది నా దగ్గరకు రీల్స్ ఎలా చేయాలో నేర్పమని" అనేసరికి రష్మీ వచ్చి ఒక రీల్ ని రాంప్రసాద్ ముందు చేసి చూపించింది. "చూసావా నీ రీల్ కి నువ్వే లైక్ కొట్టుకోలేదు అంతా వరస్ట్ గా చేసావ్" అన్నాడు రాంప్రసాద్.."ఇప్పుడు ఈ చెప్పులు ప్రాపర్టీ యూజ్ చేస్తూ రీల్ చెయ్యి" అని రాంప్రసాద్ ఒక టిప్ చెప్పేసరికి రష్మీ కూడా అలాగే చేసింది. దాంతో చాల లైక్స్ వచ్చాయి. "నాకు ఇంకా ఇది సరిపోదు ఇంకా ఫేమస్ అవ్వాలి అంటే ఏం చేయాలి" అనేసరికి రీల్స్ చేయడం ఆపేస్తే సరిపోతుంది అని చెప్పి పంపించేశాడు రాంప్రసాద్. తర్వాత సీనియర్ నటి అన్నపూర్ణ కోచింగ్ సెంటర్ కి వచ్చింది. "రీల్స్ ఎలా చేయాలో నేర్పిస్తే ఫేమస్ ఐపోతాను" అని చెప్పేసరికి "ఫేమస్ అయ్యి ఏం చేస్తావ్" అని అడిగాడు. "నాలుగు రాళ్లు ఇలా వెనక్కి వేసుకుంటాను" అని చూపించాడు. తర్వాత కొంత మంది కుర్రాళ్ళు రీల్స్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవడంతో వాళ్లకు ఎగ్జాంపుల్ గా రీల్స్ చేసే సన్నీని చూపించాడు. సన్నీ నడుముకు, ఛాతికి స్టీల్ ప్లేట్లు, స్ట్రాలు ఒంటికి కట్టుకుని వచ్చాడు. ఆ అవతారం చూసేసరికి సదా పగలబడి నవ్వేసింది. ఇలా ఈ స్కిట్ అయ్యాక దాని గురించి రాకింగ్ రాకేష్ మాట్లాడాడు "2013 లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యింది..అప్పుడు సీనియర్స్ అంతా కూర్చుని ఇంకో టీం లీడర్ స్కిట్ వేస్తూ ఉంటే చాలా హెల్తీగా ఉండేది..చాలా గ్యాప్ తర్వాత ఈ సెట్ లో చాలా పాజిటివ్ నెస్ వచ్చింది." అని చెప్పాడు. ఇక ఫైనల్ గా బెస్ట్ పెర్ఫార్మింగ్ టీం ఆఫ్ ది వీక్ గా ఆటో రాంప్రసాద్ సెలెక్ట్ అయ్యాడు.